Jadavpur University | జాదవ్ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Jadavpur University : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగింది.
Jadavpur University : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగింది. బుధవారం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఫ్‌ఈటీఎస్‌యూ) సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులకు, వామపక్ష విద్యార్థులకు మధ్య వాగ్వాదం తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తోపాటు సీపీఎం విద్యార్థి సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే, మీటింగ్ బయట కొందరు రాళ్లు, ఇటుకలు పట్టుకొని వచ్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. వాళ్లు వచ్చి తమపై దాడి చేశారని, ఈ ఘటనలో తమ వారు చాలా మంది గాయపడ్డారని వామపక్ష విద్యార్థులు చెబుతున్నారు.
కొందరు ఏబీవీపీ విద్యార్థులు కూడా గాయపడ్డట్లు సమాచారం. ముఖ్యంగా అరబిందో భవన్ క్యాంపస్ పరిధిలో ఏబీవీపీ నేతలు నిప్పుపెట్టారని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బయట నిప్పు పెట్టడంతో రాత్రంతా విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆత్మ రక్షణ కోసం క్యాంపస్ గేట్లు మూసివేయాల్సి వచ్చిందన్నారు. ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ జెండాల్ని ఏబీవీపీ నేతలు తగులబెట్టారని ఆరోపించారు. ఏబీవీపీ-బీజేపీ-ఆర్ఎస్ఎస్ గూండాలు క్యాంపస్‌లో అర్ధరాత్రి హింసకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఏబీవీపీ నేతలు ఖండించారు.
ఈ హింసకు వామపక్ష విద్యార్థులే కారణమని విమర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం క్యాంపస్‌లో ఆందోళన చేస్తామని ఏబీవీపీ ప్రకటించింది. అయితే, ఈ ఘర్షణలపై ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

