BRSV : ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మసాబ్ ట్యాంకులోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద
పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి.
జీవో నెంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యపూర్తిగా నిర్వీర్యం అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీవోను వ్యతిరేఖిస్తూ నిరసన తెలుపుతున్నారు. కాగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.