భూత్పూర్, జూన్ 20 : రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చే యకపోయినా రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ మాత్రం రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు.
అవసరమైన ఎరువులను అం దుబాటులో ఉంచడం లేదని, 24 గం టలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం లేదని, రైతు భరోసా సకాలం లో వేస్తలేదని ధ్వజమెత్తారు. రైతుబీ మా అడ్రస్సే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఎరువులపై ఇష్టానుసారంగా బస్తాకు రూ.700 పెంచడం దా రుణమన్నారు. నాడు కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడంతోనే వరి సాగు, దిగుబడి పెరిగిందని తెలిపారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే లక్ష ఎకరాల నుంచి 8 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మరో 7 లక్షల ఎకరాలకు చేరేద ని పేర్కొన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సమస్యలపై పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు.