చెన్నై: తమిళనాడులో ద్రవిడ దగ్గజం డీఎంకేతో ఆరు దశాబ్దాల బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) స్వస్తి పలికింది. రానున్న రోజుల్లో తమిళగ వెట్రి కజగం(టీవీకే)తో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ‘సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్’తో కొనసాగలేమని తేల్చిచెప్పింది. మే నెలలోనే ఐయూఎంఎల్ టీవీకేకు మద్దతు పలికింది.
ఈ నేపథ్యంలోనే టీఎంకే ప్రభుత్వంలో ఐయూఎంఎల్ నూతన ఎమ్మెల్యే ఏఎం షాజహాన్కు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా స్థానం లభించింది. రాయపురంలో ఐఎంయూఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తూనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఐయూఎంఎల్ మద్దతు పలికిందన్నారు.