పంటలు కొనకపోతే ఎలా?.. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
- సర్కార్ తీరుతో రైతన్నకు ఇక్కట్లు
- రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
భూత్పూర్, జూన్ 20 : రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చే యకపోయినా రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ మాత్రం రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు.
అవసరమైన ఎరువులను అం దుబాటులో ఉంచడం లేదని, 24 గం టలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం లేదని, రైతు భరోసా సకాలం లో వేస్తలేదని ధ్వజమెత్తారు. రైతుబీ మా అడ్రస్సే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఎరువులపై ఇష్టానుసారంగా బస్తాకు రూ.700 పెంచడం దా రుణమన్నారు. నాడు కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడంతోనే వరి సాగు, దిగుబడి పెరిగిందని తెలిపారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే లక్ష ఎకరాల నుంచి 8 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మరో 7 లక్షల ఎకరాలకు చేరేద ని పేర్కొన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సమస్యలపై పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

