Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Gurugram : హరియాణాలోని గుర్గావ్లో ఒక ఐటీ ఉద్యోగి భార్యను హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గత బుధవారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Gurugram : హరియాణాలోని గుర్గావ్లో ఒక ఐటీ ఉద్యోగి భార్యను హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గత బుధవారం జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరి మృతదేహాలు వారి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో లభించాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. కేరళకు చెందిన మొహమ్మద్ అస్లాం, ఫర్హానా దంపతులు ఐటీలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన వీరు.. మూడు నెలల క్రితమే గుర్గావ్ వచ్చారు.
అక్కడి ఎం3ఎం మెరినా రెసిడెన్షియల్ సొసైటీలోనినే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గత బుధవారం భార్య ఫర్హానా బర్త్ డే కూడా. అదే రోజు అస్లాం.. తన కంపెనీకి ఒక మెయిల్ చేశాడు. మేం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నాం అనేది ఈ మెయిల్ సారాంశం. మెయిల్ గురించి తెలిసిన తర్వాత వారి సహోద్యోగులు అస్లాం, ఫర్హానా అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఓనర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెళ్లేసరికి ఫ్లాట్ తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా భార్యాభర్తలు అస్లాం, ఫర్హానా మృతదేహాలు లభించాయి.
దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అస్లాం ఉరికి వేలాడుతూ మరణించి ఉన్నాడు. భార్య ఫర్హానా ఫ్లోర్‌పై పడి పోయి ఉంది. ఆమె మెడపై గాయాలున్నాయి. ఫర్హానాను అతడే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. భార్యను చంపిన అనంతరం అతడు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే, అస్లాం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇద్దరికీ వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, కొంతకాలంగా అస్లాం మాత్రం డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఇందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారని బంధువులు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల పరిశీలన, ఇతర ఆధారాలు, పోలీసుల విచారణ తర్వాతే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

