Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Boys Kill Friend | బైక్ కొనుగోలు చేయాలని ఒక బాలుడు భావించాడు. బర్త్ డే వేడుక కోసం డబ్బులు కావాలని మరో బాలుడు ఆశించాడు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసు కోసం స్నేహితుడ్ని హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు.
ముంబై: బైక్ కొనుగోలు చేయాలని ఒక బాలుడు భావించాడు. బర్త్ డే వేడుక కోసం డబ్బులు కావాలని మరో బాలుడు ఆశించాడు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసు కోసం స్నేహితుడ్ని హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు. (Boys Kill Friend) మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. ఆజాద్ నగర్లో నివసించే 17 ఏళ్ల ప్రజ్యోత్ కాంబ్లే, సెప్టెంబర్ 24న సాయంత్రం వేళ అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఫలితం లేకపోవడంతో ఆ యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ప్రజ్యోత్ స్నేహితుడైన ఒక బాలుడ్ని పోలీసులు ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తితో కలిసి అతడు బైక్‌పై ఘోడ్‌బందర్ వైపు వెళ్లాడని అతడు చెప్పాడు. దీంతో ఆ మార్గంలోని సుమారు వంద సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. అయితే ఆ బాలుడు చెప్పింది అబద్ధమని, తమను తప్పుదోవ పట్టించేందుకు అతడు ప్రయత్నించినట్లు వారు తెలుసుకున్నారు.
మరోవైపు సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా ఆ బాలుడిని పోలీసులు అనుమానించారు. దీంతో అతడ్ని మళ్లీ ప్రశ్నించగా ప్రజ్యోత్ హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. మెడలో ధరించే గోల్డ్ చైన్ కోసం ఫ్రెండ్‌ను హత్య చేయాలని ఇద్దరు బాలురు ప్లాన్ వేశారు. ఆ బంగారు గొలుసు అమ్మి ఒకరు బైక్ కొనుగోలు చేయాలని ఒకరు, పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకోవాలని మరొకరు భావించినట్లు దర్యాప్తులో బయటపడింది.
కాగా, సెప్టెంబర్ 24న ఆ ఇద్దరు అబ్బాయిలు సిగరెట్లు స్మోక్ చేసే నెపంతో ప్రజ్యోత్ను థానేలోని బ్రహ్మాండ్ ఫేజ్ 2 ప్రాంతం సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ వారిద్దరూ కత్తితో పొడిచి, రాయితో కొట్టి ప్రజ్యోత్ను చంపారని చెప్పారు. ఆ తర్వాత సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నంలో అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని వివరించారు.
అలాగే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు, అతడి లొకేషన్ ట్రేస్ కాకుండా ఉండేందుకు ఇద్దరు బాలురు ప్రజ్యోత్ మొబైల్ ఫోన్‌ను ఒక బస్సులోకి విసిరేశారని పోలీస్ అధికారి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులైన ఇద్దరు మైనర్ బాలురను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పోలీస్ అధికారి కీలక సూచనలు చేశారు. తమ పిల్లల కార్యకలాపాలు, స్నేహితులు, సోషల్ మీడియాతో పాటు వారి ప్రవర్తనలో మార్పులను నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా పిల్లలు నేరాలకు పాల్పడకుండా ముందుగానే నివారించే అవకాశమున్నదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- Birthday
- Boys
- gold chain
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

