తిరుపతి: తిరుపతి రామానుజ సర్కిల్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకున్నది. టీటీడీ స్వాగత ఆర్చి (కమాన్) కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా ఆ వ్యక్తిని దవాఖానకు తరలించారు. గరుడవారధి నిర్మాణ పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ లారీ తగలడంతో పాక్షికంగా ఆర్చి దెబ్బతిన్నది.