హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని చెప్పారు. గాలులు, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు.