అమరావతి : దేశంలో ఉగ్రవాద ( Terrorism ) నిర్మూలనకు కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు ప్రధాని మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) స్పష్టం చేశారు. పహల్గామ్లో ( Pehalgaon ) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధ ప్రధానిలో చూశానని వెల్లడించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెలగపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలతోను వందేమాతరం, భారత్‌మాతా కీ జై అంటూ నినాదాలు చేయించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు వచ్చారని మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోందని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు 5వ స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు.
త్వరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని అన్నారు. కేంద్రం తీసుకున్న కుల గుణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మోదీ ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఏపీ రికవరి అవుతుంది. ఇంకా సహకరమిస్తే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీ రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు.