రాయపోల్ : బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) అన్నారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట తాజా మాజీ సర్పంచ్ మాదా ప్రవీణ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించి ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కు ధైర్యం చెప్పారు.
వీరనగర్ గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటామని , ఎవరు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఆయన వెంట తాజా మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ. రాష్ట్ర యువజన నాయకులు హనుమాన్ల ఇప్ప దయాకర్, మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, ఉప్పరి స్వామి. అక్బర్ ఖాన్, రామచంద్రన్ గౌడ్, గురు ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.