పటియాలా, ఫిబ్రవరి 13: పంజాబ్‌లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
బీజేపీ పాలిత గుజరాత్లో 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గాంధీనగర్: అరేబియా సముద్రంలో గుజరాత్ తీరప్రాంతానికి సమీపంలోని సముద్ర జలాల్లో 763 కేజీల డ్రగ్స్‌ను నావికా దళంతో కలిసి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.2 వేల కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 529 కిలోల చాలా నాణ్యమైన హషిష్ (చరాస్), 234 కిలోల క్రిస్టల్ మెథాంఫిటమైన్ ఉన్నాయి.