అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ( Modi ) ఇచ్చిన పిలుపునకు ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) మద్దతు పలికారు. పొదుపు (Austerity ) మంత్రం పటిస్తున్న కేంద్రానికి తోడుగా తాము కూడా రాష్ట్రంలో పొదుపుపై ( Austerity Measures ) రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని ఆయన వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యత పాటించాలని సూచించారు.
డిజిల్,పెట్రోల్ వాడకం తగ్గించడం ద్వారా విదేశి మారకద్రవ్యం ఆదా అవుతుందని వివరించారు. యుద్ధ ప్రభావంతో జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం వస్తుంది. ప్రభుత్వంలో కూడా తీసుకొస్తామని వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా, దేశం కోసం పనిచేయాలనే ఆలోచన అందరిలో రావాలని పిలుపునిచ్చారు.
దేశంలో 50శాతం బంగారం ఉత్పత్తి ఏపీ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరగనుందని వివరించారు. దుబారా ఖర్చు తగ్గించాలని అన్నారు. పది కార్లతో కాన్వాయ్‌గా రావడం ఫ్యాషనైంది. సెక్యూరిటీ అర్ధవంతంగా ఉండాలి. ప్రధాని సూచన మేరకు విదేశి పర్యటనలను తగ్గిస్తామని స్పష్టం చేశారు.
యూఎస్,ఆస్ట్రేలియాల కంటే గొప్ప పర్యటక ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని, కశ్మీర్ కంటే అరకు వ్యాలీ ఎంతో అహ్లదకరమని వెల్లడించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అందమైన ప్రదేశాలు చూడాలంటే పోలవరం నుంచి పాపికొండల ప్రాంతాలు చూడదగ్గ స్థలాలని కొనియాడారు. గోవా కంటే మెరుగ్గా సూర్యలంక బీచ్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు.