J D Vance : అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice president) జేడీ వాన్స్ (JD Vance) తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయురాలు ఉష (USha vance) తో తనకు పెళ్లి కాకుంటే తాను జీవితాంతం బ్యాచిలర్ (Bacheler) గానే ఉండిపోయేవాడినని చెప్పారు. ఉషను తొలిసారి చూడగానే.. ‘చేసుకుంటే ఉషనే పెళ్లి చేసుకుంటా.. లేదంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉంటా’ అని తాను అప్పట్లో తన స్నేహితులతో చెప్పానని అన్నారు. వాన్స్ తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది.
యేల్ లా స్కూల్లోనే ఉషని తొలిసారి కలిసినట్లు వాన్స్ తెలిపారు. తొలిసారి చూసినప్పుడు ఆమెలో చాలా అసాధారణమైన విషయాలు తనకు కన్పించాయన్నారు. ఆమె అందం, తెలివితేటలు, సంప్రదాయం, సక్సెస్ కొలమానాలపై నిరాసక్తత వంటి అంశాలు తనను ఆకర్షించినట్లు వెల్లడించారు. తాను ఉషను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఆమెతో పెళ్లి కాకపోతే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోతానని తన స్నేహితులతో పేర్కొన్నట్లు వాన్స్ తెలిపారు. పిల్లలంటే ఆమెకు చాలా ఇష్టమన్నారు.
ఇక ఉష, జేడీ వాన్స్‌లకు 2014 లో వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. త్వరలోనే ఉష మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. వేధింపులు, మద్యపానం, పేదరికంతో కూడిన తన బాల్యాన్ని వివరిస్తూ.. వాన్స్ ‘Hillbilly Elegy’ అనే పుస్తకాన్ని రాశారు. ఇది అద్భుతమైన విజయం సాధించింది. దీన్ని సినిమాగా కూడా తీశారు.