Chandra Babu | వారికి గౌరవ వేతనాన్ని పెంచుతాం…గుడ్న్యూస్ చెప్పిన చంద్రబాబు
Chandra Babu | ఉగాది పండుగ రోజున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాలంటీర్లకు గుడ్న్యూస్ చెప్పారు.
అమరావతి : ఉగాది పండుగ రోజున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) వాలంటీర్లకు గుడ్న్యూస్ చెప్పారు. అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాలను ( Honorarium) రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని ప్రకటించారు. మంగళవారం ఏపీలోని టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్రోధినామ ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వాలంటీర్లు రాజకీయాలకు సేవచేయడం కాకుండా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వాలంటీర్ల (Volunteers) వ్యవస్థను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. ఐదేండ్ల వైసీపీ జగన్ పాలన తీరుపై విరుచుకు పడ్డారు. సహజ వనరులను వైసీపీ దోపిడీ చేసిందని ఆరోపించారు.
టీడీపీ విరాళాల వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ విరాళాల వెబ్సైట్ (TDP Donations Website) ను పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రారంభించారు. విరాళాలు అందించిన దాతలకు రసీదులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు విరాళాలు అందించేందుకు వెబ్సైట్లో అవకాశం కల్పించామని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

