హైదరాబాద్, ఏప్రిల్ 25: మాదిగ, మాదిగ ఉపకులాలను ఓటు బ్యాంకుగా వాడుకొంటున్న బీజేపీకి బుద్ధి చెప్తామని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. సోమవారం విద్యానగర్లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ రావు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకట్ పాల్గొన్నారు.