BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
BRS Councilors | మున్సిపాలిటీ నిధులతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రచారం కల్పించడం సరికాదని తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు.
తొర్రూరు : మున్సిపాలిటీ నిధులతో బతుకమ్మ వేడుకలు ( Batukamma Celebrations ) నిర్వహిస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రచారం కల్పించడం సరికాదని తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ( BRS Councilors ) ఆరోపించారు. ప్రజాధనంతో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లను విస్మరించడాన్ని ప్రశ్నించారు.
ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశమై పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం మున్సిపాలిటీ నిధుల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఈ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (వేటా) నిర్వహించినట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రైవేటు సంస్థకు ప్రచారం కల్పించడం వెనుక ఉద్దేశమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని ప్రభుత్వ కార్యక్రమంలో ఏ హోదాలో వేదికపైకి ఆహ్వానించారని వారు ప్రశ్నించారు. ప్రజలచే ఎన్నికైన కౌన్సిలర్లను వేదికపైకి పిలవకుండా, కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణమన్నారు. బతుకమ్మ వేడుకలు అధికారిక ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా? అన్నది అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తొర్రూరు మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నాయకుల సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా ఉందని ఆరోపించారు.
మున్సిపాలిటీ పరిపాలనలో రాజకీయ జోక్యం పెరుగుతోందని ఆరోపిస్తూ, కమిషనర్ వ్యవహారశైలిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కర్నే నాగరాజు, భూసాని జయమ్మ ఉప్పలయ్య, చకిలేల అలివేలు మణిరాజు, తూర్పాటి రవి, పేర్ల జంపన్న, మాడుగుల భవాని లత, ధరావత్ పద్మ కిషన్, శ్యామల శ్యామ్, కిన్నెర కవిత సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

