Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Pakistan : పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వాలో అక్కడి సమాఖ్య ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అక్కడ అధికారంలో ఉన్న పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) ప్రభుత్వాన్ని రద్దు చేసింది.
Pakistan : పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే మాటలకు పెద్దగా విలువుండదు. అక్కడా అంతా నియంతృత్వమే. ఎవరు అధికారంలో ఉంటే వారిదే పెత్తనం. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వాలో అక్కడి సమాఖ్య ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అక్కడ అధికారంలో ఉన్న పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) ప్రభుత్వాన్ని రద్దు చేసింది. రాష్ట్ర సీఎం సోహైల్ ఆఫ్రిదితోపాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రుల్ని అరెస్టు చేసింది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని సమాఖ్య ప్రభుత్వం దీనిపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రద్దు, ఎమర్జెన్సీ, సీఎం, మంత్రుల అరెస్టు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 232, 234ను ప్రభుత్వం ఉపయోగించింది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీ అంగీకారం తెలిపారు. పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను షరీఫ్ ప్రభుత్వం అరెస్టు చేసి, జైలు నుంచి విడుదల కాకుండా చూస్తోంది. దీంతో ఆయన మద్దతుదారులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.
దీనిలో భాగంగా ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం ఆఫ్రిది ఈ నెల 4న ర్యాలీ నిర్వహించారు. ఇమ్రాన్‌ను విడుదల చేయాలని కోరుతూ ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించి ఇబ్బంది కలిగించినందుకుగాను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు, పాలన సహా మొత్తం అధికారం స్థానిక గవర్నర్ పరిధిలో ఉంటుంది. ఈ అంశంపై సీఎం సోహైల్ ఆఫ్రిది స్పందించారు. తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా, గవర్నర్ పాలన విధించినా తమ డిమాండ్ల విషయంలో వెనుకడుగు వేయబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమాఖ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై . ఖైబర్ పఖ్తుంఖ్వా పరిధిలోని ప్రజలు, మద్దతుదారులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా . ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లో రోడ్లపై భారీ షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టారు. నగరవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇస్లామాబాద్‌లోని ప్రధాని నివాసం వద్ద కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

