ధురంధర్-2 ఆదాయంలో మాకూ వాటా ఇవ్వాలి
పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంత ప్రజలు ‘ధురంధర్: ది రివెంజ్(ప్రతీకారం)’ వసూళ్లలో తమకూ వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారు!
- పాక్‌లోని ల్యారీ ప్రజల డిమాండ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంత ప్రజలు ‘ధురంధర్: ది రివెంజ్(ప్రతీకారం)’ వసూళ్లలో తమకూ వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారు! తమ ప్రాంతం ఇతివృత్తంగా సినిమా కథ నడుస్తుందని.. కాబట్టి తమ ప్రాంతంలో రోడ్లు వేయడానికి, అభివృద్ధి పనులకు ఆ సినిమా నిర్మాతలు డబ్బులు ఇవ్వాలన్నది వాళ్ల తర్కం! రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా ఉత్కంఠ రేపే గూఢచర్యం కథతో బాక్సాఫీసును బద్దలు కొడుతూ ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ చానల్ కంపారిజన్ టీవీ ల్యారీ వాసులను ఈ సినిమా సక్సెస్‌పై స్పందించాలని కోరింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ తమ ప్రాంతం గురించి తీసిన సినిమా కాబట్టి దానికి వచ్చిన కలెక్షన్లతో 80 శాతం తమకే ఇవ్వాలని కోరారు. ‘ఆ సినిమాకు ఆదాయం ఇక్కడి నుంచే వచ్చింది కదా? ఇక్కడ రోడ్లు వేయడానికి ఆ డబ్బులో చాలా భాగం వాడాలి’ అని ఒకరు డిమాండ్ చేశారు. ల్యారీలోని ముఠాల నెట్‌వర్క్‌లోకి మారు వేషంలో చొరబడే భారత గూఢచారిగా ధురంధర్: ది రివెంజ్ చిత్రంలో రణవీర్ కనిపిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

