హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అవినీతి రహిత సమాజం కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిరంతరం పోరాటం చేయాలని చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్ సూచించారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్‌ను శనివారం చంచల్‌గూడ జైల్లో సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి ఎస్పీ ఆవిషరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నించడంతో పాటు నిజాయితీని రక్షించడం కూడామనపై ఉన్నదని చెప్పారు. సంస్థ చేసే కార్యక్రమాలు, పోరాటం నిరంతరం కొనసాగాలని, యువత, మహిళలను ఇందులో భాగస్వామి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొన్నె దేవేందర్, ముందడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు కోమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.