దుండిగల్, జనవరి 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు అవార్డుల పంట పండింది. బెంగళూరు గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన ఇం టర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్(ఐసీటీఐఈఈ)-2026లో కళాశాలకు 5 అ వార్డులు దక్కినట్టు యాజమాన్యం పే ర్కొన్నది. ‘ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్’ అనే థీమ్‌తో నిర్వహించిన సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వి ద్యావేత్తలు, పరిశోధకులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారని తెలిపింది.
వినూత్న బోధన పద్ధతులతోపాటు విద్యాసంస్థ అత్యుత్తమ నాయకత్వాన్ని గుర్తించిన సదస్సు నిర్వాహకులు ఎంఎల్ఆర్ఐటీని ఉత్తమ విద్యార్థిశాఖ(ఈడబ్ల్యూబీ), అవార్డు, ఉత్తమ బోధన అభ్యాస కేంద్రం(టీఎల్సీ) అవార్డులతో సత్కరించిందని పేర్కొన్నది. కళాశాలకు చెందిన డాక్టర్ అరవింద్‌కు ఐజీఐపీ, డీన్ డాక్టర్ రాధికాదేవికి ఐక్యూఏసీ అవార్డు దక్కినట్టు తెలిపింది. డాక్టర్ వీణాకుమార్కు ఐఐఈసీపీ ఎడ్యుకేటర్ అవార్డు-2026తోపాటు రూ.25వేల నగదు పురస్కారం దక్కిందని పేర్కొన్నది.
ఐసీటీఐఈఈ-2026 సదస్సులో ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు అవార్డు లు దక్కడంపై కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఇది కళాశాల అధ్యాపకులు, వి ద్యార్థులు, విద్యావేత్తల కృషికి దక్కిన ఫలితమని అభివర్ణించారు. వారందరినీ ప్రశంసిస్తున్నట్టు తెలిపారు. నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.