MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
MLA KP Vivekananda హైదరాబాద్ నగర ప్రజలందరూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతో ఇదే శాసనసభ్యులం ప్రజలందరితో కలిసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటామని హెచ్చరిస్తున్నానన్నారు.
MLA KP Vivekananda | కన్నెపల్లి పంప్ హౌసును బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఇప్పటికైనా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్య, రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఒకే ఒక్కటి హెచ్చరిస్తున్నా.. ఈ నీటి సమస్య జఠిలంగా మారి మీరు పరిష్కరించకపోతే హైదరాబాద్ నగర ప్రజలందరూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతో ఇదే శాసనసభ్యులం ప్రజలందరితో కలిసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటామని హెచ్చరిస్తున్నానన్నారు.
చేతకాని దద్దమ్మ ఈ రోజు దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నాడు. చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు.. ఇంకా కూడా కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. మీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది.. ఇంకా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపైనా దుమ్మెత్తిపోయడమే తప్ప ఒక సమస్యకు పరిష్కారం చూపించే అడుగులేవి నీవి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. పని చేసేటోడే లేడు.. ఇక్కడికెవరూ వచ్చేటోడే లేడు.. వచ్చి ఇసుకు ఎత్తుకొని పోయి అమ్ముకునేటోళ్లే తప్ప.. చిన్న రిపేర్ చేసేందుకు కిలో సిమెంట్ కూడా పెట్టింది లేదని అక్కడున్నవాళ్లు చెప్తున్నరు.
స్థానికులను అడిగితే చిన్న సిమెంట్ కూడా పెట్టింది లేదు సార్.. నీళ్లన్నీ వృధా పోతున్నయ్. మీ కండ్ల ముందే పోతున్నయ్ చూడండి.. సార్ అంటే మేం దగ్గరుండి కళ్లారా చూసినం. కాబట్టి ఈ రోజుకూ కూడా అక్కడ రిపేర్ చేసేందుకు చర్యలు లేవు. ఈ భారతదేశంలో ఇలాంటి చవట, దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరూ లేకుండొచ్చు.. అలాంటి ముఖ్యమంత్రిఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నడు.. ప్రజలకు నరకయాతన చూపిస్తున్నడు.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నడని మండిపడ్డారు.
హైదరాబాద్లో మళ్లీ నీళ్ల ట్యాంకర్ల మాఫియా మొదలైంది. నీళ్లు లేవని, రైతులు పంటలు వేయవద్దంటూ రేవంత్ చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నాడన్నారు. ఎల్నినో విపత్తుపై ఏడాది నుంచే నిపుణులు హెచ్చరించినా..మా బీఆర్ఎస్ పార్టీ ఎంతగా పోరాటం చేసినా.. కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా, నీళ్లను తోడకుండా నిర్లక్ష్యం చేసి..ఇప్పుడేమో నీళ్లు లేవంటూ రేవంత్ తప్పించుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.
చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు
రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా
నీటి సమస్యను పరిష్కరించకపోతే మా ఎమ్మెల్యేలందరం హైదరాబాద్ ప్రజలతో కలిసి వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగుతాం
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటింది. ఇంకా కేసీఆర్ను తిట్టడం తప్పిస్తే అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు
– కేపీ వివేకానంద
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

