Chandrayan-3 | భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 బుధవారం చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. భారత్‌లో ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగంపై పాక్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. పాక్ దేశంలోని మీడియాలో పతాక శీర్షికల్లో ఇస్రో సాధించిన ఘనతను మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ చానెల్ అభిప్రాయ సేకరణలో ఓ పాక్ పౌరుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ యువకుడిని యూట్యూబర్ చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రశ్నించగా.. సదరు యువకుడు ‘మనం ఇప్పటికే చంద్రుడిపైనే ఉన్నాం’ కదా అంటూ స్పందించగా.. సదరు యూ ట్యూబర్ షాక్ అయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. చంద్రయాన్-3 కీలక ప్రయోగం నేపథ్యంలో పాక్‌లో మీడియా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ పలువురిని యువకుల అభిప్రాయం సేకరిస్తుండగా.. చంద్రయాన్-3పై ప్రశ్నించాడు. దీనికి సదరు యువకుడు బదులిస్తూ మనం ఇప్పటికే చంద్రుడిపై ఉన్నాం కదా! అంటూ సమాధానం ఇచ్చాడు. అదేంటంటూ ప్రశ్నించగా.. చంద్రుడిపై కరెంటు లేదు. మన దగ్గర కరెంటు లేదు.. చందమామపై గ్యాస్ లేదు. మన దగ్గర లేదు. చంద్రుడిపై నీళ్లు లేవు.. మన దగ్గర లేవు. అంటే మనం కూడా చంద్రుడిపైనే ఉన్నట్టే కదా అని చెప్పగా.. సదరు యూట్యూబర్ షాక్ అయ్యాడు. ఈ వీడియోను ఈ నెల 23న షేర్ చేయగా.. ఇప్పటికే మిలియన్ వ్యూస్పైగా రాగా.. 22వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
Meanwhile, the Sense of Humor of Pakistani People are always top class. This on Chandrayaan pic.twitter.com/Y127YPeyIv
— Joy (@Joydas) August 23, 2023