
లండన్, నవంబర్ 1: ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021గా ‘వ్యాక్స్ (టీకా)’ పదం నిలిచినట్టు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ (ఓఈడీ) సీనియర్ ఎడిటర్ ఫియోనా మాక్ఫేర్సన్ తెలిపారు. 1980 లోనే ఈ పదం డిక్షనరీలో చేరినప్పటికీ, కొవిడ్-19 సమయంలో దీని వాడకం దాదాపు 57,000% పెరిగినట్టు పేర్కొన్నారు. కాగా, ‘లాక్డౌన్’ పదాన్ని గతేడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఓఈడీ ప్రకటించడం తెలిసిందే.