Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
Water Crisis | వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు అందుబాటులో లేవని, బాత్రూంకు వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Water Crisis | వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు అందుబాటులో లేవని, బాత్రూంకు వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో నీటి సదుపాయం లేకపోవడంతో ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్, పక్కనే ఉన్న ఎంఆర్సీ భవనం నుంచి నీటిని తెచ్చుకొని కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
విద్యార్థుల కథనం ప్రకారం.. హాస్టల్లోని బోరు ఏడాది క్రితమే పాడైపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి మరమ్మతులు చేయించలేదు. మరోవైపు మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నప్పటికీ నీటి సరఫరా జరగడం లేదని వారు వాపోతున్నారు.
బోరు మరమ్మతుల కోసం కలెక్టర్ నిధులు విడుదల చేసినప్పటికీ పనులు చేపట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాగునీరు, కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బోరుకు మరమ్మతులు చేయించి, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
తాగడానికి కూడా నీళ్లు లేవు.. మాకు నీళ్లు ఇవ్వండి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నీటి కష్టాలు
తాగడానికి కూడా నీళ్లు లేవని, బాత్రూంకు కూడా బయటకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థుల ఆవేదన
ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్, పక్కనే ఉన్న ఎంఆర్సీ భవనం నుంచి నీటిని తీసుకొని కాలకృత్యాలు తీర్చుకుంటున్న విద్యార్థులు
ఏడాది క్రితం హాస్టల్లోని బోరు పాడైపోయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని, మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నా నీటి సరఫరా జరగడం లేదని, కలెక్టర్ నిధులు విడుదల చేసినా బోరు మరమ్మతులు చేయడం లేదని విద్యార్థుల ఆవేదన
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

