Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Superstar Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' (Jailer 2) డిజిటల్ స్ట్రీమింగ్కు రంగం సిద్ధమైంది.
Superstar Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ (Jailer 2) డిజిటల్ స్ట్రీమింగ్కు రంగం సిద్ధమైంది. బాక్సాఫీసర్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. కాగా, నవంబర్ 12 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా వరల్డ్ వైడ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ కూడా సినీ వర్గాల్లో జరుగుతోంది. థియేట్రికల్ రన్‌తో పోలిస్తే ఓటీటీలో రాబోయే వెర్షన్లో దాదాపు 30 నిమిషాల అదనపు ఫుటేజ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మోహన్‌లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి తదితరుల పాత్రలకు సంబంధించిన కొన్ని డిలీటెడ్ సీన్స్ లేదా పొడిగించిన సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో జోడించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ మ్యూజిక్, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చగా, థియేటర్లలో రజనీకాంత్ ‘టైగర్ ముత్తువెల్ పాండియన్’ మానియాని మిస్ అయిన లేదా మరోసారి ఓటీటీలో ఎంజాయ్ చేయాలనుకునే సినీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED 🔥
#Jailer2OnPrime, Nov 12
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu https://t.co/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

