Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Payal Rajput | తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. టాలీవుడ్‌కు మద్దతుగా నిలుస్తూ రాధికా ఆప్టే వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు.
Payal Rajput | తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. టాలీవుడ్‌కు మద్దతుగా నిలుస్తూ రాధికా ఆప్టే వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు. తనకు గుర్తింపు, అవకాశాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇన్నేళ్ల తర్వాత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన పాయల్ రాజ్‌పుత్.. తనకు టాలీవుడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నానని, ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఇచ్చే గౌరవం, కొత్తవారిని ఆహ్వానించే విధానం తనకు ప్రత్యక్షంగా తెలుసని చెప్పారు. వ్యక్తిగత హద్దులు, నిర్ణయాలు ఎవరి ఇష్టమని పేర్కొంటూనే.. కెరీర్‌కు పునాది వేసిన పరిశ్రమ మొత్తాన్ని తప్పుబట్టడం మాత్రం సమంజసం కాదన్నారు.
తనకు పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు తీసుకొచ్చిన పరిశ్రమ గురించి ఏళ్ల తర్వాత ప్రతికూలంగా మాట్లాడటం ధైర్యం కాదని, అది కృతజ్ఞతాభావం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి టాలీవుడ్ అందించిన అవకాశాలే కారణమని స్పష్టం చేశారు. తనకు కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ మద్దతుగా ఉంటానని చెప్పారు. ఇదే విషయాన్ని పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు. తాను తెలుగు నటిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. స్టార్డమ్, గుర్తింపు ఇచ్చిన పరిశ్రమనే ఇన్నేళ్ల తర్వాత విమర్శించడం కృతజ్ఞత లేని చర్యగా అభివర్ణించారు. కెరీర్‌కు పునాది వేసిన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తంపై విమర్శలు చేయడం అసహనాన్ని, అక్కసును బయటపెట్టడమేనని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
పంజాబీ నేపథ్యం నుంచి వచ్చిన పాయల్ రాజ్‌పుత్.. 2018లో విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఆమె.. తనకు అవకాశాలు ఇచ్చిన పరిశ్రమ పట్ల కృతజ్ఞతను చాటుకున్నారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మొదలైన చర్చలో పాయల్ రాజ్‌పుత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టాలీవుడ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

