Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Khammam SDRF | ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమంగా బయటపడ్డారు.
Khammam SDRF | ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గల్లంతైన ఓ మత్స్యకారుడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
బుధవారం ఉదయం చేపల వేట కోసం వలలు కట్టేందుకు ఐదుగురు మత్స్యకారులు బేతుపల్లి చెరువు అలుగు వద్దకు వెళ్లారు. మురసు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద చేరడంతో వారంతా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యలకు పంపించారు. రెండు లైఫ్ బోట్లలో మొత్తం 11 మంది సిబ్బంది వరదలోకి వెళ్లారు. వారు ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
అయితే, తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెండు బోట్లు అదుపుతప్పి బోల్తాపడ్డాయి. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగు వైపు కొట్టుకుపోయారు. తొలుత 11 మంది గల్లంతైనట్లు సమాచారం అందగా.. తాజాగా వారిలో 10 మంది క్షేమంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రామనగరం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడి కోసం గాలిస్తున్నారు.
గల్లంతైన మత్స్యకారుడు లైఫ్ జాకెట్ ధరించాడని, అతడు గజ ఈతగాడని సమాచారం. దీంతో అతడిని సురక్షితంగా గుర్తిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో అజయ్‌కుమార్ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

