Suvendu Adhikari : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) ఎమ్మెల్యే (MLA) గా ప్రమాణం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) సమక్షంలో సువేందు ప్రమాణం స్వీకరించారు. సువేందు (Suvendu) తోపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా సువేందు ప్రమాణం చేసిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Kolkata: West Bengal Chief Minister Suvendu Adhikari takes oath as an MLA in the Legislative Assembly.
(Source: West Bengal Assembly) pic.twitter.com/3m0rJ2doqi
— ANI (@ANI) May 13, 2026
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో గడిచిన ఐదేళ్లుగా అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన సువేందుకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి.. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పాటైన వెంటనే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేసేందుకు భూమిని కేటాయించింది. దీనిపై బంగ్లాదేశ్ స్పందిస్తూ ముళ్ల కంచెలు తమను భయపెట్టలేవని వ్యాఖ్యానించారు.