TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
TN CM Vijay | ప్రముఖ సంగీత దర్శకుడు (Music Director), గాయకుడు దేవా (Deva) భౌతికకాయానికి తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay), మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) వేర్వేరుగా నివాళులు అర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) లోని టీ నగర్ (T Nagar) లో ఉన్న దేవా నివాసంలో ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి పుష్పాంజలి ఘటించారు.
TN CM Vijay : ప్రముఖ సంగీత దర్శకుడు (Music Director), గాయకుడు దేవా (Deva) భౌతికకాయానికి తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay), మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) వేర్వేరుగా నివాళులు అర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) లోని టీ నగర్ (T Nagar) లో ఉన్న దేవా నివాసంలో ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో ‘తేనిసై తెండ్రల్ (మధుర సంగీత సమీరం)’ గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన దేవా సుదీర్ఘ ప్రస్థానంలో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400 లకు పైగా చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన అందించిన సంగీతం ఎంతో ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’, పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘తొలిప్రేమ’, రజనీకాంత్ సూపర్ హిట్ డబ్బింగ్ మూవీ ‘భాషా’, అలాగే ‘ఖుషి’ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ముఖ్యంగా తమిళ జానపద ‘గానా’ సంగీత శైలిని వెండితెరకు పరిచయం చేసి, మాస్ బీట్స్‌తో ఆబాలగోపాలాన్ని అలరించారు. దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు.
దేవా హఠాన్మరణంపట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, సంగీత అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. దేవాకు సీఎం, మాజీ సీఎం నివాళులు అర్పించేందుకు వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Chennai, Tamil Nadu: Chief Minister Vijay paid his respects to music director Deva at his residence in T. Nagar after his demise. https://t.co/wQLupdtERQ
— ANI (@ANI) October 17, 2026
#WATCH | Chennai, Tamil Nadu: Former CM and DMK president MK Stalin leaves after paying his last respects to music director Deva at his residence in T. Nagar following his demise. https://t.co/5vvUTaNP2x
— ANI (@ANI) October 17, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

