Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
Pratima Singh | ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు.
Pratima Singh | పాపన్నపేట, అక్టోబర్ 17 : వీబీ–జీ రామ్ జీ పథకం కింద పనులు వేగవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఆమె శనివారం పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో వీబీ–జీ రామ్ జీ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..పంటల సాగుకు నీటి కొరత లేకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునేందుకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణం, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం, జలసిరి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో, ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదు ఫామ్ పాండ్ల చొప్పున ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
నిర్మాణ పనులకు ప్రతిరోజూ ఎంత మంది కూలీలు హాజరవుతున్నారు. వారికి ఎంత మేర కూలి చెల్లిస్తున్నారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతోపాటు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో భూగర్భ జల మట్టాల పెంపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వీబీ–జీ రామ్ జీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించి.. చేపట్టాలని సూచించారు. చెక్ డ్యామ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాసరావు, ఎంపీడీవో విష్ణువర్ధన్ తహసీల్దార్ సతీష్, గ్రామ మాజీ సర్పంచ్ జగన్ పాల్గొన్నారు.


Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

