Attack on teacher : కన్న తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువును గౌరవించాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఓ విద్యార్థి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. స్కూల్ నుంచి తీసివేశాడన్న కోపంతో తన స్నేహితులతో కలిసి వచ్చి టీచర్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని మొరెనా (Morena) లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఓ విద్యార్థి దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ప్రధానోపాధ్యాయుడికి చెప్పి స్కూల్ నుంచి సస్పెండ్ చేయించాడు. ఇది మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థి తన ఇద్దరు స్నేహితులతో కలిసి టీచర్‌పై దాడికి ప్లాన్ చేశాడు. ముగ్గురు ముఖాలకు ముసుగులు ధరించి వచ్చి టీచర్‌పై కర్రతో దాడికి పాల్పడ్డారు.
దాంతో టీచర్ తీవ్రంగా ప్రతిఘటించాడు. విద్యార్థి చేతిలో కర్ర లాక్కుని ఎదురు దాడి చేశాడు. ఈ సందర్భంగా మరో విద్యార్థి కర్రతో టీచర్ మెడపై కొట్టాడు. టీచర్ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ ముగ్గురు పారిపోయారు. ఆ తర్వాత టీచర్ అదే కర్ర అందుకుని వారిని వెంబడించాడు. క్లాస్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే ఈ ఘటన జరిగింది. ఈ దాడి దృశ్యాలు క్లాస్ రూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
#WATCH | Youth Barges Into Coaching Class With His Friends In Morena, Attacks Former Math Teacher With Stick#MPNews #MadhyaPradesh pic.twitter.com/cxBEroPAKr
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 6, 2024