హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత యువ బీఎమ్ఎక్స్ రేసర్ అగస్తి చంద్రశేఖర్ సత్తాచాటాడు. అమెరికాలోని ఒక్లోహమా సిటీ వేదికగా గత నెలలో జరిగిన యూఎస్ఏ గ్రాండ్ నేషనల్స్ టోర్నీలో అగస్త నాలుగో స్థానంలో నిలిచాడు.
వివిధ దేశాల నుంచి 48 మంది రేసర్లు పోటీపడగా అగస్తి నాలుగో స్థానంతో పోడియం ఫినిష్ చేశాడు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న బీఎమ్ఎక్స్ రేసింగ్‌లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి రేసర్‌గా నిలిచాడు.