RJD chief : రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి (Former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బుధవారం 78వ పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) జరుపుకున్నారు. బీహార్ రాజధాని పట్నా (Patna) లోని తన నివాసంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
ఈ పుట్టినరోజు వేడుకలకు లాలూ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. లాలూ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ లాలూ చేత కేక్ కట్ చేయించి తినిపించారు. లాలూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు, అభిమానులు ‘జిందాబాద్.. జిందాబాద్.. లాలూ యాదవ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
#WATCH | RJD chief and former Bihar CM Lalu Yadav celebrates his 78th birthday at his residence in Patna. pic.twitter.com/qI6wt2z5yP
— ANI (@ANI) June 11, 2025