Hand grenade : లడఖ్ (Ladakh) లోని ద్రాస్ సెక్టార్ (Drass sector) లో పాత హ్యాండ్ గ్రెనేడ్ (Hand grenade) ఒకటి కలకలం రేపింది. పండ్రాస్ గ్రామం (Pandras village) లోని నది సమీపంలో ఈ హ్యాండ్ గ్రెనేడ్‌ను ఆర్మీ జవాన్ (Army jawans) లు గుర్తించారు. వెంటనే దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు, జవాన్లు కలిసి ఆ హ్యాండ్ గ్రెనేడ్‌ను ధ్వంసం చేశారు.
ఈ విషయాన్ని లడఖ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అసలు ఆ హ్యాండ్ గ్రెనేడ్ అక్కడికి ఎలా వచ్చింది..? అది ఎన్నేళ్ల క్రితం నాటిది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Ladakh | Old hand grenade discovered near the river in Pandras village, Drass neutralised by Army and Police in Drass
(Source: Ladakh Police) pic.twitter.com/1uyyqHI2lK
— ANI (@ANI) December 16, 2025