Heavy rain : జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్ గ్రామం పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఆ గ్రామంలోని వీధుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది.
దాంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. చోగల్ గ్రామం నీళ్లలో కూరుకుపోయిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | J&K: Heavy rain triggers a flood-like situation in Chogal village in North Kashmir’s Kupwara district. pic.twitter.com/XlFeY9WhKk
— ANI (@ANI) April 29, 2024