Bulldozer Saves Dog |బుల్డోజర్లు అంటే త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి, కాల్వలు తవ్వడానికి ఉపయోగిస్తారు. కానీ బుల్డోజర్ సాయంతో ప్రాణాలు కాపాడొచ్చని ఈక్వెడార్ వాసులు రుజువు చేశారు. మనుష్యుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించారు. ఈక్వెడార్‌లోని పసాజే కాంటాన్లో ఓ నీటి పారుదల కాలు వద్ద నిర్మాణ కార్మికులు పని చేస్తున్నారు. ఆ కాలువ నీటి ప్రవాహంలో ఒక శునకం కొట్టుకుపోతున్నదని వారికి రేడియో అలర్ట్ వచ్చింది. అంతే వారు ఆ జాగిలాన్ని కాపాడేందుకు సిద్ధమయ్యారు.
బొల్డోజర్ డిగ్గర్లో ఒక కార్మికుడు కూర్చోగా.. డ్రైవర్ అతడ్ని నీటి ప్రవాహంపైకి తీసుకెళ్లాడు. మరో కార్మికుడు కాలువలో నీటి ప్రవాహంపై పైపులైన్ సాయంతో నిలిచి శునకాన్ని వడిసి పట్టుకున్నారు. ఎటువంటి హాని కలుగకుండా బయటకు తీసుకు వచ్చారు. అంతే కాదు.. వారు డబ్బు సేకరించి శునకానికి ఇన్ఫెక్షన్ కలుగకుండా చికిత్స చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో ట్రెండవుతున్నది. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇతర అవసరాలకు కూడా బుల్డోజర్లను వాడొచ్చు అని ట్వీట్ చేశారు.