Rahul Gandhi on Taxi bike: గోవాలో ట్యాక్సీ బైక్‌పై రాహుల్ జర్నీ.. ఎక్కడికి వెళ్లారంటే.. వీడియో
Rahul Gandhi on Taxi bike: గోవాలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటన కొనసాగుతున్నది. ఒక్కరోజు పర్యటన కోసం ఇవాళ గోవాకు వెళ్లిన రాహుల్‌గాంధీ ముందుగా..

పనాజీ: గోవాలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటన కొనసాగుతున్నది. ఒక్కరోజు పర్యటన కోసం ఇవాళ గోవాకు వెళ్లిన రాహుల్‌గాంధీ ముందుగా.. దక్షిణ గోవాలోని వల్సావో గ్రామంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పనాజీలోని అజాద్ మైదాన్ ఏరియాలోగల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ ట్యాక్సీ బైక్‌పై ప్రయాణం చేశారు ( Rahul Gandhi on Taxi bike ).
గోవాలో మోటార్ సైకిళ్లను అద్దెకిస్తుంటారు. పైలట్‌గా సుపరిచితమైన ఈ మోటార్ సైకిల్ ట్యాక్సీ సర్వీస్ నుంచి ఒక బైకును అద్దెకు తీసుకుని రాహుల్‌గాంధీ దానిపై ప్రయాణం చేశారు. ముందు ఒక వ్యక్తి బైకును నడుపుతుంటే రాహుల్‌గాంధీ అతని వెనుక కూర్చుని ప్రయాణించారు. ఇంతకూ ఆ ట్యాక్సీ బైకుపై ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారంటే గోవా రాజధాని పనాజీలోని బాంబోలిమ్ నుంచి అజాద్ మైదాన్ వరకు. ఆ తర్వాత అజాద్ మైదాన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు.
#WATCH | Congress leader Rahul Gandhi takes a ride on Goa's motorcycle taxi known as 'Pilot', from Bambolim to Azad Maidan in Panaji
— ANI (@ANI) October 30, 2021
(Source: Congress party) pic.twitter.com/kCc0KVQsoY
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

