Viral news : సాధారణంగా అక్కడ పాము తిరుగుతోందంటేనే ఆ వైపు అడుగు కూడా వేయం. ఒకవేళ పాము కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాళ్లకు పని చెబుతాం. ఇక పాము కాటు వేస్తే లబోదిబోమంటూ గావు కేకలు పెడుతాం. అలాంటిది బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన ప్రకాశ్ మాండల్ అనే వృద్ధుడు మాత్రం తనను పాము కాటు వేసినా అదరలేదు, బెదరలేదు. ఏకంగా తనను కాటేసినా పామును గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. ఆ పామును మెడలో వేసుకుని చికిత్స కోసం కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లాడు.
ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో పామును పట్టుకునే ఫ్లోర్‌పై పడుకున్నాడు. ఇంతలో సిబ్బంది గమనించి అతడిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పామును ఎందుకు వెంట తెచ్చావని వైద్యులు ప్రశ్నిస్తే.. ఏ పాము కరిసిందో ప్రూఫ్ కోసమని చెప్పాడు. పాము ఏదో తెలిస్తే చికిత్స సులభం అవుతుందని తెచ్చానన్నాడు. వృద్ధుడు ‘రక్త పింజర’ను మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH: Bihar Man Arrives at Hospital With Snake As ‘Evidence of Bite’#Viral #ViralVideo #Bihar #Snake pic.twitter.com/pf35uDx7Y6
— TIMES NOW (@TimesNow) October 17, 2024