PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్ (Indian Badminton Star) పీవీ సింధు (PV Sindhu) ఇవాళ (గురువారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న సింధుకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నారు. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో తాను విజయం సాధించాలని వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నట్లు సింధు తెలిపారు. పీవీ సింధు ఆలయం నుంచి తిరిగి వెళ్తున్న సందర్భంగా పలువురు స్వామివారి భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Badminton player PV Sindhu visits the Sri Venkateswara Swamy Temple in Tirumala to offer prayers. pic.twitter.com/bWEq0sXiHv
— ANI (@ANI) April 16, 2026