టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘పవర్ పేట’ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి గతంలో పలువురు యంగ్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి ఈ పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ కథానాయకుడిగా ఖరారయ్యారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. “ప్రతి కదలికకు ఒక ధర ఉంటుంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేమ, గౌరవం మరియు రాజకీయాల చుట్టూ తిరిగే కథతో ఉండబోతోంది.
ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సాంకేతిక రంగంలో దిగ్గజాలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, మధి సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చదరంగం బోర్డు మరియు విరిగిన పావులను చూపించడం సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఒక సామాన్యుడు రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే క్రమాన్ని ఈ సినిమాలో ఎంతో లోతుగా చూపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
16 years of Cinema, Your Love , Blood & Grit ♥️
Grateful for every step, for every lesson and for every bit of love you have given me 🧿Here’s to the next Ambitious Chapter – #PowerPeta
A story of Love. Honour. Politics.Need all your love as always 🤗#krishnachaitanya… pic.twitter.com/1WNT7Fawtb
— Sundeep Kishan (@sundeepkishan) April 16, 2026