మెల్బోర్న్: వారం రోజుల తర్వాత ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికకాయం స్వదేశానికి చేరింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ప్రైవేట్ జెట్లో గురువారం రాత్రి మెల్బోర్న్కు చేరుకుంది. ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అధికారికంగా జరిగే అంతిమ సంస్కారాలకు లక్ష మందికి పైగా అభిమానులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొసముయ్ ద్వీపంలో గుండెపోటుతో వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం.. పోలీసుల విచారణ తదితర ప్రక్రియలన్నీ పూర్తయిన అనంతరం దాదాపు వారం తర్వాత వార్న్ భౌతికకాయం ఆస్ట్రేలియాకు తరలించారు. విమానాశ్రయంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, వార్న్ వ్యక్తిగత కార్యదర్శి హెలెన్ నోలన్ నివాళులర్పించారు.