స్పోర్ట్స్లేని స్కూల్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా, హడావుడిగా వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ సూల్ తూతూమంత్రంగా కొనసాగుతున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
- నిధుల్లేవు.. పోస్టుల్లేవు.. సిబ్బంది లేరు
- హడావుడిగా వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం
- ఏడాది గడిచినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- ఏడాదిగా జేఎన్ఎస్లో తాత్కాలికంగా నిర్వహణ
- కొత్త భవనానికి భూసేకరణ ఉత్తదే
- వసతుల లేమితో విద్యార్థులకు అవస్థలు
హనుమకొండ, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా, హడావుడిగా వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ సూల్ తూతూమంత్రంగా కొనసాగుతున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లోని పాత భవనాల్లో ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ స్కూల్ నిర్వహణ కోసం ప్రభుత్వం కనీస వసతుల సంగతి దేవుడెరుగు! కనీసం ఇక్కడ క్రీడా పాఠశాల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించలేదు.
గత విద్యా సంవత్సరంలో 4వ తరగతికి 80 మందికి అడ్మిషన్లు పూర్తి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 80 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. అడ్మిషన్లు ఇవ్వడమేగానీ స్కూల్లో చేరిన వారికి అధికారికంగా ఎలాంటి గుర్తింపూ ఇచ్చే పరిస్థితి లేదు. వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా నిధులను, పోస్టులను మంజూరు చేయలేదు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఒక్క జీవోనూ విడుదల చేయలేదు. నిధులు, సిబ్బంది లేకపోవడంతో స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణ నాసిరకంగా నడుస్తున్నది.
డ్రాప్ అవుట్స్
ఆటలలో ప్రతిభతో రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాల్సిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రోగాల బారిన హాస్టల్ వదిలి ఇంటికి వెళ్లిపోతున్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు స్కూల్లో ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. తాగేందుకు, స్నానానికి నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ కూడా ఇక్కడ సరిగా లేదు. తమకు పౌష్టికాహారం కూడా సరిగ్గా అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రతతో పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్లో కచ్చితంగా ఉండాల్సిన డాక్టర్ నియామకం ఇప్పటికీ కాలేదు.
స్టూడెంట్స్ పదేపదే అనారోగ్యం బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆటల కంటే ఆరోగ్యమే మేలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు స్కూల్ నుంచి పిల్లలను తీసుకెళ్తున్నారు. ఇలా మొదటి ఏడాదిలోనే దాదాపు 14 మంది విద్యార్థులు స్కూల్ వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం ఇక్కడ జరిగిన కుకల దాడిలో ఓ విద్యార్థి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం విద్యార్థి కుటుంబం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
శిక్షణ లేదు
స్పోర్ట్స్ స్కూల్లో కోచ్‌లు లేకపోవడం వింతగా ఉన్నది. క్రీడాభివృద్ధి సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్ (బాయ్స్, గర్ల్స్), రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, లాన్‌టెన్నిస్, ఖోఖో, వాలీబాల్ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఏ ఒక్క ఆటలోనూ ప్రభుత్వం కోచ్‌లను నియమించలేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొన్ని విభాగాలకు తూతూ మంత్రంగా కోచ్‌లు నియామకం జరిగింది.
శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో ఈ స్కూల్లో చేరిన వారికి ఏ ఆటలోనూ నైపుణ్యం రావడం లేదని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్క ఇక్కడ తాత్కాలిక స్కూల్ భవనం, హాస్టల్ భవనాలతో పాటు ఇండోర్, ఔట్‌డోర్ గ్రౌండ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. తరగతుల నిర్వహణకు అవసరమైన భవనాలు, ఫర్నీచర్, స్పోర్ట్స్ మెటిరియల్నూ ప్రభుత్వం సమకూర్చలేదు. హాస్టల్ మెస్ నిర్వహణ కూడా ఘోరంగా ఉన్నది.
ఎక్కడో తెలియదు
స్పోర్ట్స్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేలా సిబ్బంది, వసతులు ఉండాలి. కానీ తాత్కాలిక భవనంలో ప్రారంభించి దాన్ని స్పోర్ట్స్ స్కూల్‌గా ప్రభుత్వం చెప్పుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారులోని 20 ఎకరాల్లో అన్ని హంగులతో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది.
తాత్కాలిక భవనంలో ప్రారంభించి ఏడాది గడిచినా అధికారులు ఇప్పటికీ అనువైన స్థలాన్ని గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారులో విశాలమైన స్థలంలో భవనాలు నిర్మించి, సిబ్బందిని నియమించిన తర్వాత ఏర్పాటుచేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్పోర్ట్స్ స్కూల్‌ను తాత్కాలికంగా ఓ భవనంలో ఏర్పాటుచేసి ప్రభుత్వం పట్టించుకోకపోవడం కరెక్టు కాదని క్రీడా సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

