రైతులకు అండగా రాష్ట్ర సర్కారు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న వారి కుటుంబాలకు రైతుబీమా పథకం ధీమాను ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
- అన్నదాతలకు ధీమా ఇస్తున్న రైతు బీమా
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
- బాధిత కుటుంబసభ్యులకు బీమా చెక్కుల పంపిణీ
- ఎనుమాముల పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనుల పరిశీలన
- పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
వర్ధన్నపేట, నవంబర్ 25 : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న వారి కుటుంబాలకు రైతుబీమా పథకం ధీమాను ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలోని ఫిరంగిగడ్డకు చెందిన రైతులు అహ్మద్ అజీజ్, సూర యాకయ్య ఇటీవల మరణించగా, వారికి మంజూరైన రూ.5లక్షల బీమా చెక్కులను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి కుటుంబసభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మృతి చెందితే వారి కుటుంబాలు ఆగం కాకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదన్నారు. అలాగే, మండలంలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన ధర్మరాజు కుమార్తె సన్నిధి అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. కాగా, చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన ఎల్వోసీని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిశీలన..
కాశీబుగ్గ : ఎనుమాములలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను తొందరగా చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సులోచన, సీఐ చేరాలు, మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరుకాపు భవన నిర్మాణ పనులు ప్రారంభం..
నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్నగర్లో ము న్నూరుకాపు భవనం స్లాబ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమేశ్ ప్రారంభించారు. మున్నూరుకాపులు సమష్టిగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. భవన నిర్మాణానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

