e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Warangal : తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్​​‍ ఎంవోయూ..

Warangal : తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్​​‍ ఎంవోయూ..

గీసుగొండ : వరంగల్‌ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న టెక్స్‌టైల్‌ పార్కులో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేరళ రాష్ట్రంకు చెందిన కిటెక్స్​​‍ గార్మెంట్స్​‍ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం హైదరాబాద్‌ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ పరిశ్రమ చైర్మన్‌ సాబుజాకబ్‌ సమావేశమై ఒప్పదం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ టెక్స్​​‍టైల్‌ పార్కు నందు కిటెక్స్​​‍ కంపెనీ రావటం సంతోషధాయకమన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలను ఆకర్షించటంలో ఉన్నత స్థానంలో ఉందన్నారు. కిటెక్స్​​‍ కంపెనీలో తయారయ్యే బట్టలకు రాష్ట్రంలో మంచి ధర కూడా లభిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుతో పత్తి పంట పండించే రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఈ పరిశ్రమలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సుమారుగా 9వేల మందికి ప్రత్యేక్షంగా పరోక్ష్యంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. పత్తి పంట పండించే పద్దతిలో మార్పును తీసుకోవస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, పరకాల ఎమ్మెల్యేచల్లా ధర్మారెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement