నర్సంపేట రూరల్, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరికి నిరసనగా సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి అధ్యక్షతన అన్ని రాష్ర్టాల్లోలాగానే తెలంగాణ రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరతో మొత్తం కొనుగోలు చేయాలని మండల సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎంపీపీ తీర్మానం ప్రవేశపెట్టగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేదాకా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అంబటి సునిల్కుమార్రాజ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బీ వీరన్ననాయక్, ఎంపీటీసీలు ఊడ్గుల రాంబాబు, వల్గుబెల్లి విజయ, బండారి శ్రీలత, సర్పంచ్ బొజ్జ యువరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, బండారి రమేశ్, తుత్తూరు రమేశ్, బరిగెల కిశోర్, వల్గుబెల్లి ప్రతాప్‌రెడ్డి, చిన్నపెల్లి నర్సింగం, దూడల ప్రకాశ్, దూడల ప్రవీణ్ తదితరులున్నారు.
రైతులపై కక్షపూరిత వైఖరికి ప్రజాప్రతినిదుల నిరసన
పర్వతగిరి: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరికి నిరసనగా సోమవారం పర్వతగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కమల పంతులు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పా టు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అన్ని రాష్ర్టాల్లో లాగానే తెలంగాణ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని మండల సభలో ఎంపీటీసీలు ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర పభుత్వమే పూర్తి బాధ్యతతో రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభలో రైతుల కోసం అత్యవసర సమావేశంలో ఎంపీపీ కమల తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు రైతులు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్‌కు ఏకగ్రీవ తీర్మానం కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోపరిషత్ ఆప్షన్ సభ్యులు సర్వర్, ఎంపీడీవో చక్రాల సంతోశ్ కుమార్, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, కర్మిల్ల మోహన్‌రావు, లావణ్య, సూర రమేశ్, సర్పంచ్‌లు అమడగాని రాజు యాదవ్, బానోత్ వెంకన్ననాయక్, రేణుకానాగయ్య, ప్రమీల గోపి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట, మార్చి 28: వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పీఎం మోదీకి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ తీర్మానించడమైందని చైర్మన్ మురహరి రవి తెలిపారు. సోమవారం అమీనాబాద్ సొసైటీ ఆవరణలో ని ర్వహించిన 67వ మహాసభలో పాల్గొని మాట్లాడారు. సహకార సంఘ అభివృద్ధి కోసం సంఘ పరిధిలో ప్రజల సౌకర్యార్థం మూడు ఎరువుల విక్రమ కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పెండ్లి మల్లయ్య, డైరెక్టర్లు ముస్కు ఐలయ్య, డీ కొమ్మాలు, భూక్యా హుస్సేన్, మాదారపు నర్సయ్య, అలువాల శాంతమ్మ, బండి స్వరూప, గడ్డల స్వరూప, అనుముల యాకాంతం, రవి, మల్లాడి వీరారెడ్డి, సీఈవో నార్లాపురం ఎల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి,: వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పాలక మం డలి ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక ఎపీడీవో తుల రామ్మోహన్‌కు గ్రామ పంచాయతీ పాలక వర్గ తీర్మాన పత్రాన్ని సర్పంచ్ గారె నర్సయ్య, ఉప సర్పంచ్ ఎండీ మైమూద్పాష అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గుగులోత్ అశోక్‌నాయక్, కారోబారు కారుపోతుల రాంచంద్రయ్య, వార్డు సభ్యులు పోగులకొండ వేణు, కుంట రాంబాబు, సార మ్మ, జహంగీర్, లావణ్య పాల్గొన్నారు.