‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్
ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్
మరిపెడ పీహెచ్సీ అంబులెన్స్ ప్రారంభం
మరిపెడ, మార్చి 30 : ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకే మంత్రి కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎమ్మెల్యే రెడ్యా కొనుగో లు చేసిన 108(అంబులెన్స్)వాహనాన్ని మంగళవారం వారు ప్రారంభించి మాట్లాడారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో నియోజకవర్గాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మన ప్రాం తవాసుల కోసం 108వాహనంతోపాటు అంబులెన్స్ ఉండాలని గుర్తించి రూ.21లక్షలు ప్రభుత్వానికి అందజేసినట్లు చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజల కోసం మరిపెడ పీహెచ్‌సీకి ఈ అంబులెన్స్‌ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. క్షతగాత్రులను సకాలంలో దవాఖాన కు తీసుకెళ్లడానికి, అత్యవసర వైద్య సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. హార్ట్ బీట్, పల్స్రేట్ చెక్ చేసే సదుపాయం ఈ అంబులెన్స్‌లో ఉందన్నారు. పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులకు అవసరమైతే అంబులెన్స్‌లోనే కాన్పు చేసే వెసులుబాటు కూడా ఉందన్నా రు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూరాకుమారి, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీలు తేజావత్ శారద, భూక్యా సంగీత, వైస్ ఎంపీపీ అశోక్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రఘు, మాజీ జడ్పీటీసీ మాణిక్యం, మాజీ ఎంపీపీ వెంకన్న, కురవి, డోర్నకల్, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల టీఆర్ఎస్ బాధ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.