నర్సంపేట రూరల్/దేగ్గొండి, మార్చి 13 : ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ శివారు రాళ్లకుంట చెరువులో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామానికి చెందిన చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి(55)కి రంగాపురం శివారులో ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈయనకు భార్యతో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు కాగా, అందరికీ వివాహాలయ్యాయి. కొడుకుకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
కొడుకు ఊరూరా బట్టల వ్యాపారం చేయడంతో పాటు తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో కృష్ణమూర్తి దంపతులతో పాటు కొడుకు నాగరాజు(34), కోడలు సంధ్య, మనుమళ్లు దీపక్(లక్కీ)(11), కార్తీక్ రంగాపురంలోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మక్కజొన్నను బస్తాల్లో నింపారు. అనంతరం భోజనం చేసేందుకు చేతులు కడుక్కోవడానికి తాత నాగరాజు, మనుమడు దీపక్ పక్కనే ఉన్న రాళ్లకుంట చెరువులోకి దిగారు. మనువడు మునిగిపోతుండగా, రక్షించబోయి తాత కూడా అందులోకి వెళ్లగా, ఒడ్డున ఉన్న కొడుకు నాగరాజు నీటిలోకి దిగగా ముగ్గురూ మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
నాగరాజు భార్య సంధ్య, గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. సంధ్య ఫిర్యాదు మేరకు దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్సై వంగల సవీన్కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం నర్సంపేట దవాఖానకు తరలించారు. కాగా, దీపక్ నర్సంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో చిన్న గురిజాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బాధిత కటుంబానికి పెద్ది పరామర్శ..
చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతులు, కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ మృతదేహాలకు నివాళు లర్పించారు అనంతరం మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరో సా ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, చిన్న గురిజాల, గురిజాల, గుం టూరుపల్లి, జీజీఆర్‌పల్లి, అడవి రంగాపురం గ్రామాల సర్పంచ్‌లు గడ్డం సుజాత, గొడిశాల మమత, కర్నాటి పార్వతమ్మ, తుత్తూరు కోమల, కొండం రమాదేవీవిజేందర్రెడ్డి, ఎంపీటీసీ బండారు శ్రీలత, మందపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ సింగతి కార్తీక్, గడ్డం సుజాత, రాజు ఉపసర్పంచ్ రాజ్‌కుమార్, శంకర్, భాస్కర్, న్యాయవాది మోటూరి రవి, టీఆర్ఎస్ నాయకులు రవి, రమేశ్, రాజు, తదితరులున్నారు.
మంత్రి దయాకర్‌రావు దిగ్భ్రాంతి..
నర్సంపేట రూరల్ : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న గురిజాల గ్రామానికి చెందిన మూడు తరాల వ్యక్తు లు వెంగలదాసు కృష్ణమూర్తి, కుమారుడు నాగరా జు, మనుమడు దీపక్ చెరువులో పడి మృత్యువాత ప డడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు.