కాశీబుగ్గ/నర్సంపేట రూరల్/సంగెం/చెన్నారావుపేట, మార్చి 13 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కాశీబుగ్గలో తెలంగాణ జాగృతి వరంగల్ తూర్పు ఇన్చార్జి పెండ్యాల సోనీబాబు, మరి చందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కేక్ కట్ చేసి చిన్నారులకు, వృద్ధులకు, బాటసారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రపంచానికి తెలియజేసిన మహిళ కవిత అన్నారు.
కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఎండీ ఫుర్కాన్, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షులు యార బాలకృష్ణ, సుశీల్గౌడ్, ఇక్బాల్, ఈటెల ఉమేందర్, సుంకరి బాగ్యలక్ష్మీ, కళావతి పాల్గొన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేటలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ (టీజేఎస్ఎఫ్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్ భారీ కేక్‌ను కట్ చేసి పంచారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. తెలంగాణ మహిళా లోకానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారన్నారు.
అనంతరం గ్రామస్తులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, నాయకులు సాంబరాజు, మచ్చిక నర్సయ్యగౌడ్, దేశిని సుదర్శన్‌గౌడ్, రాంప్రసాద్, బొంతల సాయికుమార్, విక్రం, క్రాంతికుమార్, రాజ్‌కుమార్, మనోజ్, మొండయ్య, సాంబయ్య, కుమారస్వామి, రాకేష్ ఉన్నారు. సంగెం మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ జాగృతి అధ్యక్షుడు మునుకుంట్ల చందు ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, ఉన్నత అధిరోహించాలని కాంక్షించారు.
ఎంపీపీ కళావతి, సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్, పార్టీ గ్రామ అధ్యక్షుడు అప్పె నాగార్జునశర్మ, కోడూరి సదయ్య, నరహరి, టీజేఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల అఖిల్‌యాదవ్, యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం, తోట ప్రభాకర్, భరత్‌రెడ్డి, శరత్, మోహన్‌నాయక్, సాయి, సాంబరాజు, చిర్ర రాజు, పోశాల ప్రవీణ్, బందెల రమేష్‌బాబు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల యువ నాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి ఆధ్వర్యంలో జాగృతి మండల అధ్యక్షుడు మూడు రమేశ్ ఎమ్మెల్సీ కవిత బర్త్ డే కేక్ కట్ చేశారు. వార్డుసభ్యులు రాసమల్ల సతీష్, గ్రామ యూత్ అధ్యక్షుడు ననుమాస సాయి కుమార్, అడుప అశోక్, సింగిరెడ్డి అనిల్, కిరణ్, ఈశ్వర్, సుమన్, లక్ష్మణ్, చాపర్తి రాజు, మహేందర్, రాజు పాల్గొన్నారు.