నర్సంపేట, నవంబర్15 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో 21వ మండల పూజలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయం అయ్యప్పస్వాముల భజనతో మార్మోగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్ గుప్త నేతృత్వంలో పూజలు ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, నర్సంపేట మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కోశాధికారి దుబ్బ రమేశ్, దేవునూరి అంజయ్య, శ్రీరాం ఈశ్వరయ్య, ఇరుకు కోటేశ్వర్రావు, గోనెల రవీందర్, ఇరుకుల వీరలింగం నూతన వస్ర్తాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించి అన్నదానం చేశారు. పద్దెనిమిది మెట్లపై జ్యోతులు వెలిగించారు. అంతకు ముందు సుప్రభాత సేవ, మహాగణపతి హోమం, ఓంకార ధ్వజారోహణం, గోపూజ, హోమగుండ ఆవిర్భావం, మహాసుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మాదారపు చంద్రశేఖర్గుప్త, వంగేటి గోవర్ధన్గుప్త, బాల్నే సర్వేశం, శ్రీరాముల శంకరయ్య, బొద్దుల దివాకర్, పిన్నా రామనాథం, భూపతి లక్ష్మీనారాయణ, పూల్లూరి స్వామిగౌడ్, దొడ్డ రవీందర్, బీరం రవీందర్‌రెడ్డి, అడ్డగట్ల మల్లయ్య, భరత్, దేశీరాము, దేవీశ్మిశ్రా, నిరాకరసాహు, సతీశ్తివారి, మిడిదొడ్డి బాబురావు, సంజీవరావు, యాదగిరి, నాగరాజు, వెంకట్రాజం, 400 మంది భక్తులు పాల్గొన్నారు.